Y S Kondareddy: వైఎస్‌ కొండారెడ్డి జిల్లా బహిష్కరణ!

వైయస్‌ఆర్‌ జిల్లా చక్రాయపేట మండల వైకాపా ఇన్‌ఛార్జి వైఎస్‌ కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలనే ప్రతిపాదనలను కలెక్టర్‌ విజయరామరాజుకు పంపినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు

Published : 12 May 2022 08:56 IST

కలెక్టరుకు ప్రతిపాదనలు పంపిన ఎస్పీ

ఈనాడు డిజిటల్‌, కడప: వైయస్‌ఆర్‌ జిల్లా చక్రాయపేట మండల వైకాపా ఇన్‌ఛార్జి వైఎస్‌ కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలనే ప్రతిపాదనలను కలెక్టర్‌ విజయరామరాజుకు పంపినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పులివెందుల నియోజకవర్గంలో చక్రాయపేట మండలం మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారును బెదిరించిన కేసులో రెండు రోజుల కిందట కొండారెడ్డి అరెస్టయ్యారు. ఆయనను లక్కిరెడ్డిపల్లె కోర్డులో హాజరుపరచగా జడ్జి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండు విధించారు. బెయిలు పిటిషన్‌ దాఖలు చేేయగా విచారించిన కోర్టు.. బుధవారం బెయిలు మంజూరు చేసింది. ఆయన విడుదల కాగానే జిల్లా బహిష్కరణ ప్రతిపాదన ప్రకటన వెలువడింది. దీనిపై గురువారం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొండారెడ్డిపై ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ఉద్యోగులను బెదిరించిన కేసుతోపాటు పలు కేసులున్నాయని ఎస్పీ తెలిపారు. బెయిలుపై విడుదలైన కొండారెడ్డి కడప నగరానికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని