ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం: వైకాపా ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

ధాన్యం కొనుగోళ్లలో భాగంగా ఈ-క్రాప్‌ నమోదులో కుంభకోణం దాగి ఉందని వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ అధికారులు, మిల్లర్లు కలిసి రైతుల వివరాలను ఆధార్‌కు లింక్‌

Updated : 19 May 2022 08:12 IST

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లలో భాగంగా ఈ-క్రాప్‌ నమోదులో కుంభకోణం దాగి ఉందని వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ అధికారులు, మిల్లర్లు కలిసి రైతుల వివరాలను ఆధార్‌కు లింక్‌ చేయడం లేదని తెలిపారు. ఈ ఏడాది రబీలో పంట వివరాలను పూర్తిగా ఈ-క్రాప్‌లో నమోదు చేశారన్నారు. అందులో రైతుల పేర్లు మారుస్తూ మిల్లర్లు, బడా వ్యాపారులు పరోక్షంగా లాభం పొందుతున్నారని చెప్పారు.  17వేల మంది రైతుల చిరునామాలు గల్లంతైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిందన్నారు. అధికారులే వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారని, దీనిపై తన దగ్గర ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి సీఐడీ విచారణ కోరతానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని