అవినీతికి పాల్పడిన వీవోఏలపై కేసులు: ఉపముఖ్యమంత్రి

డ్వాక్రా సంఘాలకు సంబంధించిన పొదుపు, రుణాల మంజూరులో అక్రమాలు జరిగిన ప్రాంతాల్లోని వీవోఏలు, సీసీలు, ఇతర అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని అధికారులను

Updated : 20 May 2022 06:16 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డ్వాక్రా సంఘాలకు సంబంధించిన పొదుపు, రుణాల మంజూరులో అక్రమాలు జరిగిన ప్రాంతాల్లోని వీవోఏలు, సీసీలు, ఇతర అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆదేశించారు. గతంలో అవినీతికి పాల్పడిన వారిపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. పింఛన్ల మంజూరుకు జారీ చేసిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను మండల స్థాయి కమిటీతో తనిఖీ చేయిస్తామని వెల్లడించారు. అక్రమంగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సచివాలయంలో ఆయన గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీపై (సెర్ప్‌) గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వీవోఏల నియామక నిబంధనల్లో మార్పులు చేయాలి. ఇకపై మహిళలనే వీవోఏలుగా ఎంపిక చేయాలి. 18-45 ఏళ్ల మధ్య వయసు కలిగిన స్థానికులకే అవకాశం కల్పించాలి’ అని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని