పట్టాలెక్కనున్న రైల్వేజోన్‌!

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. శుక్రవారం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌), ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్లను సందర్శించిన ఆయన ‘ఈనాడు’తో

Updated : 21 May 2022 06:49 IST

‘దక్షిణ కోస్తా’కు  డీపీఆర్‌ ఆమోదం దాదాపు పూర్తి
‘ఈనాడు’తో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఈనాడు-చెన్నై: దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. శుక్రవారం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌), ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్లను సందర్శించిన ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రైల్వేజోన్‌కు సంబంధించిన డీపీఆర్‌ ఆమోద ప్రక్రియ దాదాపు ఖరారయ్యే స్థితిలో ఉందన్నారు. తమ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు కచ్చితంగా సంతోషిస్తారని తెలిపారు. ‘మొదట్లో రెండు వందేభారత్‌ రైళ్లను నడిపాం. వాటి పనితీరును గమనించి ఇప్పుడు చెన్నై ఐసీఎఫ్‌ నుంచి 75 వందేభారత్‌ రైళ్లను తయారు చేస్తున్నాం. రెండు ప్రొటోటైప్‌ రైళ్లు ఈ ఏడాది ఆగస్టులోపు పూర్తవుతాయి. వచ్చే ఏడాది ఆగస్టునాటికి అన్నీ సిద్ధమవుతాయి’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ తర్వాత 400 వందేభారత్‌ రైళ్లను దేశవ్యాప్తంగా అమల్లోకి తేవడానికి ప్రయత్నిస్తామన్నారు. మొదటి బుల్లెట్‌ రైలును 2026కు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. చెన్నై ఐసీఎఫ్‌ నుంచి ఇప్పటివరకు 12వేల కోచ్‌లు తయారై దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. 12 వేలవదిగా బయటికొచ్చిన ఏసీ-2టైర్‌ కోచ్‌ను శుక్రవారం రైల్వే మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని