Updated : 21 May 2022 09:12 IST

Andhra News: అమ్మఒడిలో మరో రూ.వెయ్యి కోత

మౌలిక సదుపాయాల నిర్వహణకు మినహాయింపు

ఈనాడు, అమరావతి: ‘అమ్మఒడి’ పథకం కింద ఇస్తున్న రూ.15వేలల్లో ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోత వేయనుంది. మొత్తంగా రూ.2వేలకు కోతపడనుంది. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.వెయ్యి తగ్గించగా.. ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ.వెయ్యి మినహాయించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద జూన్‌లో రూ.13వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారుల నుంచి మినహాయించిన మొత్తాన్ని పాఠశాల విద్యాశాఖ ద్వారా బడుల నిర్వహణకు కేటాయిస్తారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమాచారాన్ని జిల్లాస్థాయి అధికారులకు చేరవేశారు. నవంబరు 8 నుంచి ఏప్రిల్‌ 30వరకు విద్యార్థి హాజరు 75శాతం ఉంటేనే అమ్మఒడి నగదు అందుతుంది. అమ్మఒడి పథకాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయలేదు. గతేడాది జనవరి 11న ఈ పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా.. ఈ ఏడాది విద్యార్థుల హాజరు పేరుతో దీన్ని జూన్‌కు మార్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని