రెండేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం: రోజా

రాబోయే రెండేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని  పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాలశాఖ మంత్రి ఆర్‌.కె.రోజా తెలిపారు.

Published : 22 May 2022 05:14 IST

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: రాబోయే రెండేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని  పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాలశాఖ మంత్రి ఆర్‌.కె.రోజా తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం రాతి వనాలను సందర్శించారు. అక్కడే పర్యాటకశాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నానన్నారు. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో చర్చించి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ పథకం కింద శ్రీశైలంలో రోప్‌వేను ఏర్పాటు చేస్తోందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సీమ జిల్లాల్లోని ప్రాంతాల అభివృద్ధి గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకుడు రామచంద్ర, డివిజనల్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఈశ్వరయ్య, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల పర్యాటకశాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని