‘జలకళ’ విద్యుత్తుకు రూ.2 లక్షలు ఇస్తాం

వైఎస్సాఆర్‌ జలకళ పథకంలో తవ్వే బోర్లకు ఇచ్చే విద్యుత్తు కనెక్షన్ల ఏర్పాట్లకు రూ.2లక్షల వరకే ప్రభుత్వం చెల్లిస్తుందని, ఆపై ఎంత ఖర్చయినా రైతులే భరించాల్సి ఉంటుందని

Published : 22 May 2022 05:45 IST

ఆపై ఖర్చయితే రైతే భరించాలి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: వైఎస్సాఆర్‌ జలకళ పథకంలో తవ్వే బోర్లకు ఇచ్చే విద్యుత్తు కనెక్షన్ల ఏర్పాట్లకు రూ.2లక్షల వరకే ప్రభుత్వం చెల్లిస్తుందని, ఆపై ఎంత ఖర్చయినా రైతులే భరించాల్సి ఉంటుందని విద్యుత్తు, గనులు, అటవీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పు డిస్కం పరిధిలో 2.63 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు వచ్చే ఆరు నెలల్లో స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేస్తామని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్తుపై ఏడాదికి రూ.10వేల కోట్ల ఖర్చవుతోందని, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో ఆ వ్యయాన్ని రూ.3500 కోట్లకు తగ్గించవచ్చని అన్నారు. పోలవరం పూర్తిచేస్తే చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయబోరా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపైనా పత్రికలు దురుద్దేశ కథనాలు రాస్తున్నాయి అని పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని