రాష్ట్ర విద్యార్థినికి జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు

దళిత విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలనే ఉద్దేశంతో కేంద్రం నిర్వహించిన శ్రేష్ట ప్రవేశ పరీక్షల్లో అనంతపురానికి చెందిన విద్యార్థిని ప్రణీత మొదటి ర్యాంకు సాధించింది

Published : 22 May 2022 05:47 IST

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: దళిత విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలనే ఉద్దేశంతో కేంద్రం నిర్వహించిన శ్రేష్ట ప్రవేశ పరీక్షల్లో అనంతపురానికి చెందిన విద్యార్థిని ప్రణీత మొదటి ర్యాంకు సాధించింది. మొత్తం 400 మార్కులు తెచ్చుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు గంగప్ప, నాగవేణి తెలిపారు. ఆర్డీటీ సహకారంతో ఉత్తమ ర్యాంకు సాధించానని, కలెక్టర్‌ కావడమే తన లక్ష్యమని ప్రణీత పేర్కొంది. ర్యాంకులు సాధించిన వారికి 9, 10, 11వ తరగతులను సీబీఎస్‌ఈ సిలబస్‌తో కూడిన విద్యాసంస్థల్లో విద్యనందిస్తారు. ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు