కుమార్తెపై మమకారం.. ప్రత్యేక కారు సాకారం!

పుట్టుకతోనే ప్రత్యేక ప్రతిభావంతురాలైన కుమార్తె సౌకర్యం కోసం ఆ తల్లిదండ్రులు సాధారణ కారును మార్పు చేయించారు. 7వ తరగతి చదువుతున్న దీక్షసంపత్‌ను బయటకు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లడం కష్టం కావడంతో బెంగళూరు హోస్‌కోటేలో

Published : 22 May 2022 05:58 IST

పుట్టుకతోనే ప్రత్యేక ప్రతిభావంతురాలైన కుమార్తె సౌకర్యం కోసం ఆ తల్లిదండ్రులు సాధారణ కారును మార్పు చేయించారు. 7వ తరగతి చదువుతున్న దీక్షసంపత్‌ను బయటకు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లడం కష్టం కావడంతో బెంగళూరు హోస్‌కోటేలో సాధారణ కారును విద్యార్థిని వీల్‌ఛైర్‌తో సహా కూర్చునేలా తయారు చేయించారు. లోపలకు, బయటకు వెళ్లేలా ర్యాంప్‌ అమర్చారు. ఇందుకు రూ.2.30 లక్షలు వెచ్చించారు. బెంగళూరుకు చెందిన ఈ కుటుంబం శనివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చింది.
 

- ఈనాడు, తిరుపతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని