సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దు: మంత్రి విశ్వరూప్‌

కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చినందున ఎస్సీలు సామాజిక మాధ్యమాల్లో ఇతరులను రెచ్చగొట్టే, కించపరిచే పోస్టులేవీ పెట్టొద్దని రాష్ట్ర మంత్రి విశ్వరూప్‌ శనివారం ఓ ప్రకటనలో కోరారు.

Published : 22 May 2022 05:58 IST

అమలాపురం, న్యూస్‌టుడే: కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చినందున ఎస్సీలు సామాజిక మాధ్యమాల్లో ఇతరులను రెచ్చగొట్టే, కించపరిచే పోస్టులేవీ పెట్టొద్దని రాష్ట్ర మంత్రి విశ్వరూప్‌ శనివారం ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వం ఇచ్చిన 30 రోజుల గడువు వరకు ఓపికగా ఉండాలన్నారు. కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని