Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల నేడు

ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం,

Updated : 24 May 2022 06:58 IST

తిరుమల, న్యూస్‌టుడే: ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించి అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్‌ డ్రా తీసి సేవా టికెట్లు పొందిన వారికి సమాచారం అందిస్తారు.
శ్రీవారి ధర్మ దర్శనానికి వచ్చిన భక్తులు సోమవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 26 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటలు పడుతోంది. భక్తులకు గదులు దొరక్క షెడ్లు, ఆరుబయట సేద తీరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని