Andhra News: పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు: సీసీఎల్‌ఏ ఉత్తర్వులు

రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధులకు సాగు భూముల కేటాయింపు మొదలుకొని నిషిద్ధ జాబితా నుంచి తప్పించే వరకు ప్రతి ప్రక్రియా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరగాలంటూ భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

Published : 24 May 2022 08:28 IST

ఈనాడు, అమరావతి: రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధులకు సాగు భూముల కేటాయింపు మొదలుకొని నిషిద్ధ జాబితా నుంచి తప్పించే వరకు ప్రతి ప్రక్రియా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరగాలంటూ భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ల అనుమతి లేకుండా పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇవ్వకూడదని తెలిపారు. భూకేటాయింపు తరవాత పదేళ్ల కాలపరిమితి దాటితే వాటిని అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. మాజీ సైనికోద్యోగులు, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధులకు భూకేటాయింపులు, ఇతర అంశాలపై విశాఖ జిల్లా కలెక్టర్‌ స్పష్టత కోరారు. ఈ మేరకు మాజీ సైనికోద్యోగుల విషయంలో ఇటీవల ఇచ్చినట్లే.. రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధుల విషయంలో సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని