రాష్ట్రంలో అనధికారిక విద్యుత్తు కోతలు

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బుధవారం రాత్రి అనధికారిక విద్యుత్తు కోతలు విధించారు. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) కింద పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గజపతినగరం, తెర్లాం, నెల్లిమర్ల, వేపాడ, ఎస్‌.కోట, జామి, బాడంగి

Published : 26 May 2022 06:07 IST

ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరిట పలు జిల్లాల్లో సరఫరా నిలిపివేత
రాత్రివేళ తీవ్ర ఇబ్బందులు పడ్డ జనం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బుధవారం రాత్రి అనధికారిక విద్యుత్తు కోతలు విధించారు. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) కింద పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గజపతినగరం, తెర్లాం, నెల్లిమర్ల, వేపాడ, ఎస్‌.కోట, జామి, బాడంగి, చీపురుపల్లి పట్టణాల్లో సాయంత్రం 7 గంటల నుంచి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రమైన విజయనగరంలో రాత్రి 11 గంటల నుంచి విద్యుత్తు కోతలు విధించారు. ప్రకాశం జిల్లా కంభం, మార్కాపురం, సింగరాయకొండ, నెల్లూరు జిల్లా గుడ్లూరులలో రాత్రి 9 గంటలకు సరఫరా ఆగిపోయింది. అర్ధరాత్రి 12 గంటల వరకూ కరెంట్‌ రాలేదు. శ్రీకాకుళం, కడప, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్తు కోతలు విధించారు. విజయవాడలోని పటమటలో రాత్రి 10.30 గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అనధికారిక కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరెంటు కోతలకు నిరసనగా నెల్లూరు జిల్లా ఉలవపాడులో జాతీయ రహదారిపై గ్రామస్థులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని