ఒప్పంద అధ్యాపకులకు రెండు నెలల జీతం కోత

ఒప్పంద జూనియర్‌ అధ్యాపకులకు ప్రభుత్వం రెండు నెలల జీతం కోత విధించింది. ఇప్పటివరకు పది రోజుల విరామంతో 12 నెలలకు ఇస్తున్న వేతనాన్ని 10 నెలలకే పరిమితం చేస్తూ

Published : 27 May 2022 05:25 IST

ఈనాడు, అమరావతి: ఒప్పంద జూనియర్‌ అధ్యాపకులకు ప్రభుత్వం రెండు నెలల జీతం కోత విధించింది. ఇప్పటివరకు పది రోజుల విరామంతో 12 నెలలకు ఇస్తున్న వేతనాన్ని 10 నెలలకే పరిమితం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. 2022-23 విద్యా సంవత్సరానికి ఏప్రిల్‌1 నుంచి 10 నెలలపాటు జీతం చెల్లించనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,618 మంది ఒప్పంద జూనియర్‌ లెక్చరర్లు 2 నెలల వేతనాన్ని కోల్పోయారు. ఒక్కో లెక్చరర్‌ రూ.లక్ష వరకు నష్టపోయారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో 10రోజుల విరామంతో 12నెలల వేతనం ఇస్తామని ప్రకటించి రెండేళ్లు అమలుచేశాక ఇప్పుడు నిలిపేయడమేమిటని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని