పౌల్ట్రీ రైతుల సమస్యలు పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ రైతుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆ సంఘం నాయకులు కోరారు. కాకినాడ జిల్లా అన్నవరంలో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల పౌల్ట్రీ రైతుల ఆత్మీయ సమ్మేళనం

Published : 27 May 2022 05:25 IST

తొండంగి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ రైతుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆ సంఘం నాయకులు కోరారు. కాకినాడ జిల్లా అన్నవరంలో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల పౌల్ట్రీ రైతుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ పౌల్ట్రీ రైతుల సంఘ అధ్యక్షుడు మచ్చ సుధాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్‌ కంపెనీలు ఏకమై పౌల్ట్రీ రైతులను దోచుకుంటున్నాయన్నారు. మార్కెట్‌లో కిలో చికెన్‌ రూ.300కు విక్రయిస్తున్నా, రైతుకు మాత్రం కిలోకు రూ.4.50 ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడీని నిరసిస్తూ తెలంగాణలో చేస్తున్నట్లే.. జూన్‌ ఒకటి నుంచి ఏపీలోనూ లాక్‌డౌన్‌ అమలు చేస్తామన్నారు. పౌల్ట్రీ రైతులకూ ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్నారు. రైతుకు మద్దతు ధర కిలోకు రూ.12 చెల్లించాలని, డిమాండ్ల సాధనకు శుక్రవారం నుంచి జిల్లాల వారీగా కమిటీలు వేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని