వరసిద్ధుడి ఉదయాస్తమాన సేవకు అనుమతి

తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆలయంలో నిర్వహిస్తున్న ఉదయాస్తమాన సేవ తరహాలో చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవాలయంలోనూ సేవను నిర్వహించేందుకు అనుమతిస్తూ దేవాదాయశాఖ కమిషనరు హరి

Published : 27 May 2022 05:25 IST

కాణిపాకం, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆలయంలో నిర్వహిస్తున్న ఉదయాస్తమాన సేవ తరహాలో చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవాలయంలోనూ సేవను నిర్వహించేందుకు అనుమతిస్తూ దేవాదాయశాఖ కమిషనరు హరి జవహర్‌లాల్‌ ఉత్తర్వులిచ్చారు. టికెట్‌ ధరను రూ.లక్షగా నిర్ణయించారు. సంవత్సరంలో ఒక రోజున 10ఏళ్ల పాటు భక్తులను ఉదయాస్తమాన సేవకు అనుమతిస్తారు. స్వామివారి ప్రధాన ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఈ సేవను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో జరిగే గోపూజ, సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, గణపతి హోమం, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఏకాంత సేవలకు అనుమతిస్తారు. ఈ సేవలో పాల్గొనే భక్తుల వసతి కోసం రెండు ఏసీ గదులు ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని