అమరరాజాలో నూతన ఆవిష్కరణలు

తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని అమరరాజా సంస్థ త్వరలోనే ఆర్‌అండ్‌డీలో తమ నూతన ఆవిష్కరణలను వాణిజ్య తయారీ దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందని ఆ సంస్థ సహ

Published : 27 May 2022 05:36 IST

సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఎంపీ గల్లా  

రేణిగుంట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని అమరరాజా సంస్థ త్వరలోనే ఆర్‌అండ్‌డీలో తమ నూతన ఆవిష్కరణలను వాణిజ్య తయారీ దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఎంపీ గల్లా జయదేవ్‌ వెల్లడించారు. ఈ నెల 23 నుంచి 26 వరకు దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారని ఆ సంస్థ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. జయదేవ్‌ మాట్లాడుతూ... ‘మా గ్రూపు పలు నూతన ఎనర్జీ స్టార్టప్‌ల కోసం దేశంతోపాటు, విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. దాదాపు ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను రానున్న 5-10 సంవత్సరాల కాలంలో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ సామర్థ్యం మెరుగుపరిచేందుకు పెట్టనుంది. భారతదేశ గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యాలను చేరుకోవడంలో మా సంస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది...’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని