గ్రూపు-1 ప్రధాన పరీక్ష ఫలితాల విడుదల

గ్రూపు-1 (నోటిఫికేషన్‌ 27/2018) ప్రధాన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 325 మంది మౌఖిక పరీక్షలకు అర్హత సాధించారు. వారి హాల్‌టికెట్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది

Published : 27 May 2022 05:36 IST

జూన్‌ 15 నుంచి జరిగే మౌఖిక పరీక్షలకు 325 మంది ఎంపిక

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 (నోటిఫికేషన్‌ 27/2018) ప్రధాన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 325 మంది మౌఖిక పరీక్షలకు అర్హత సాధించారు. వారి హాల్‌టికెట్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. జూన్‌ 15 నుంచి మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తొలుత ఈ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్‌ మూల్యాంకనం చేసి ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ విధానంలో జరిగిన మూల్యాంకనంవల్ల తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సాధారణ పద్ధతిలోనే (పెన్ను, పేపర్‌) మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. గత అక్టోబరులో జారీ చేసిన ఆదేశాల ప్రకారం 3 నెలల్లో ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. ఇప్పుడు విడుదల చేసింది. డిజిటల్‌ మూల్యాంకనం ఫలితాల్లో ముందు వరసలో ఉన్న పలువురు అభ్యర్థులు వెనుకబడ్డారు. వెనుక వరసలో ఉన్నవారు ముందుకు వచ్చారు. జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియను సీసీ కెమెరాల మధ్య నిర్వహించినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. గ్రూపు-1 పరీక్షలను 2020లో డిసెంబరు 14 నుంచి 20 వరకు నిర్వహించారు. మౌఖిక పరీక్షలకు ఎంపికైన 325 మందిలో 124 మంది తొలి జాబితాలో ఉన్నవారేనని సమాచారం. తొలి జాబితాలో ముందు వరుసలో ఉన్న వారిలో పలువురు వెనుకబడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని