సర్వదర్శనానికి 17 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి వారాంతంలో భక్తులు భారీగా తిరుమలకు తరలి వస్తున్నారు. ధర్మ దర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, ఆస్థాన మండపం వరకు ఉన్నారు. వీరికి 17 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. భక్తులకు గదులు లభించక షెడ్లు, శ్రీవారి ఆలయం

Published : 27 May 2022 05:38 IST

శ్రీవారికి అత్యధికంగా రూ.5.43 కోట్ల హుండీ ఆదాయం 

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి వారాంతంలో భక్తులు భారీగా తిరుమలకు తరలి వస్తున్నారు. ధర్మ దర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, ఆస్థాన మండపం వరకు ఉన్నారు. వీరికి 17 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. భక్తులకు గదులు లభించక షెడ్లు, శ్రీవారి ఆలయం ఎదుట సేద తీరుతున్నారు. స్వామివారికి బుధవారం అత్యధికంగా రూ.5.43 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 76,148 మంది దర్శించుకోగా.. 39,208 మంది తలనీలాలు సమర్పించారు.

* తిరుమలలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు ఈదురు గాలులతో కూడిన వర్షంతో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. దుకాణాల కప్పులు పడిపోయాయి. పాపవినాశనం వైపు వెళ్లే భక్తులు ఇబ్బంది పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని