మహానాడులో తెదేపాకు భారీగా విరాళాలు

మహానాడు సందర్భంగా తెదేపాకు భారీగా విరాళాలు వచ్చాయి. గుంటూరుకు చెందిన తెదేపా నాయకుడు మన్నవ మోహనకృష్ణ రూ.31,60,000 విలువైన

Published : 28 May 2022 07:09 IST

మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: మహానాడు సందర్భంగా తెదేపాకు భారీగా విరాళాలు వచ్చాయి. గుంటూరుకు చెందిన తెదేపా నాయకుడు మన్నవ మోహనకృష్ణ రూ.31,60,000 విలువైన తాగునీటి బాటిళ్లు అందించారు. తెదేపా నాయకుడు కోవెలమూడి రవీంద్ర (గుంటూరు) పార్టీకి అత్యధికంగా రూ.27 లక్షల విరాళం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దామచర్ల జనార్దన్‌, ఇంటూరి నాగేశ్వరరావు రూ.25 లక్షలు చొప్పున విరాళాలిచ్చారు. ఆర్‌.శ్రీనివాసరెడ్డి (కడప), పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (మైదుకూరు), గల్లా జయదేవ్‌ (గుంటూరు) రూ.20 లక్షలు చొప్పున అందించారు.

రూ.15 లక్షలు ఇచ్చినవారు: బీసీ జనార్దన్‌రెడ్డి (బనగానపల్లె), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి).

రూ.10 లక్షలు ఇచ్చినవారు: జీవీ ఆంజనేయులు (వినుకొండ), భాష్యం ప్రవీణ్‌ (గుంటూరు), దామచర్ల సత్య (ఒంగోలు), ఎం.ఎం.కొండయ్య (చీరాల), పమిడి రమేష్‌ (ఒంగోలు), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), శంకర్‌ యాదవ్‌ (తంబళ్లపల్లె).

రూ.5 లక్షలు ఇచ్చినవారు: డేగల ప్రభాకర్‌ (గుంటూరు), వేగేశ్న నరేంద్రవర్మ (బాపట్ల), బొల్లినేని రామారావు (ఉదయగిరి), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి), కొమ్మాలపాటి శ్రీధర్‌ (పెదకూరపాడు), పిన్నమనేని వీరయ్య (గుడివాడ), ఉగ్ర నరసింహారెడ్డి (కనిగిరి), బీఎన్‌ విజయ్‌కుమార్‌ (సంతనూతలపాడు), ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (తెనాలి), ఎం.అశోక్‌రెడ్డి (గిద్దలూరు), ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), టీజీ భరత్‌ (కర్నూలు), పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి (కొవ్వూరు), తోట సీతారామలక్ష్మి (భీమవరం), ఆదిరెడ్డి వాసు (రాజమహేంద్రవరం), ఎ.రాధాకృష్ణ (తణుకు), దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), మన్నం సుబ్బారెడ్డి (డోన్‌).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని