
YSRCP: ఒంటరిగా విజయం సాధించగలరా?
నరసరావుపేట సభలో చంద్రబాబుకు రాష్ట్ర మంత్రుల సవాల్
మూడోరోజు కొనసాగిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర
ఈనాడు-గుంటూరు, అమరావతి, ఈనాడు డిజిటల్- ఏలూరు: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాలని సామాజిక న్యాయభేరి యాత్రలో ప్రసంగించిన పలువురు రాష్ట్ర మంత్రులు సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సింహం సింగిల్‌గానే వస్తుందని, తిరిగి అధికారంలోకి వచ్చేది జగన్‌మోహన్‌రెడ్డే అని వారు స్పష్టం చేశారు. శనివారం మూడోరోజు సామాజిక న్యాయభేరి యాత్ర తాడేపల్లిగూడెంలో ప్రారంభమై ఏలూరు, విజయవాడ, చిలకలూరిపేట మీదుగా రాత్రికి నరసరావుపేటకు చేరుకుంది. నరసరావుపేట సభలో పలువురు మంత్రులు మాట్లాడుతూ... జగన్‌ను ఓడించడానికి పవన్ కల్యాణ్, సీపీఐ, సీపీఎం, భాజపా.. ఇలా అందరితో పొత్తు పెట్టుకుంటానని చెప్పడం సిగ్గుగా లేదా అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మీరెన్ని పొత్తులు పెట్టుకున్నా.. పొర్లు దండాలు పెట్టినా... అధికారం కల్లేనని వ్యాఖ్యానించారు. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగిస్తూ...‘మహానాడు వేదికగా చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు మేం పంచుతున్నామంటున్నారు... ఆ పంచుడులో ఎక్కడైనా అవినీతి జరిగిందని చెప్పగలరా?
ఒక్క ఆరోపణ చేయలేకపోయారే? ఎవరికి పంచుతున్నాం? ఎంతో మందికి అన్నం పెడుతున్న అన్నదాతలకు, సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతికి చేయూతనిస్తున్నాం. అది మీ కళ్లకు కనిపించడంలేదా’ అని ధ్వజమెత్తారు. మంత్రి విడదల రజిని ప్రసంగిస్తూ... ‘మీ ఓట్లు నాకేయండి. మీ తలరాతలు మారుస్తానని హామీనిచ్చి అధికారంలోకి రాగానే దాన్ని ఆచరించి చూపిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది’ అని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘అసలు జగన్‌ను ఎందుకు ఓడించాలి? కరోనా సమయంలోనూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నందుకా... తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసినందుకా... ఆటోవాలాలు, డ్వాక్రా మహిళలకు రుణాలిప్పించి ఆదుకున్నందుకా..’ అని ప్రశ్నించారు. పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మహానాడు వేదికపై బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు ఫొటో ఏది? ఇదేనా బీసీలకు ఇచ్చే ప్రాధాన్యం? అచ్చెన్నాయుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు’ అని విమర్శించారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘అది మహానాడు కాదు.. ఏడుపునాడు’...అని అభివర్ణించారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. కనీసం ఎమ్మెల్యేగా గెలవాలని లోకేశ్‌కు సవాల్ విసిరారు. తాడేపల్లిగూడెంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ప్రతీకగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేనురాజు ప్రసంగిస్తూ.. తరతరాలుగా తమకంటూ ఓ గుర్తింపు ఉంటుందా అని ఎదురు చూసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేశారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. శ్రీలంకలో ప్రధానిని తరిమికొట్టినట్లుగా జగన్‌ను తరిమికొట్టాలని మహానాడులో తెదేపా నేతలు మాట్లాడటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రివద్ద ఏర్పాటు చేసిన సభకు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) రాలేదు. విజయవాడ బెంజిసర్కిల్‌లో జరిగిన సభలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం రూ.1.40 లక్షల కోట్లను ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని, దీనిలో ఏమైనా అవినీతి జరిగిందేమో నిరూపించేందుకు మహానాడులో చర్చ పెడతారా అని సవాలు విసిరారు. మంత్రి జోగి రమేష్ ప్రసంగిస్తూ.. మరో 25ఏళ్లు జగనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు.
ఎండకు అలసి సొలసి...
యాత్ర సందర్భంగా నిర్వహించిన పలు సభల్లో ప్రజలు ఎండలో రోడ్లపై నిల్చొనే నాయకుల ప్రసంగాలు వినాల్సి వచ్చింది. ఎండవేడిమి తట్టుకోలేక కొందరు వెనుదిరగడంతో చాలా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. తాడేపల్లిగూడెంలో ఏర్పాట్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొందరు మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉంగుటూరు మండలం కైకరం దగ్గర టెంట్లు వేయకపోవడంతో సభకు హాజరైన వారంతా చెట్ల కింద నిరీక్షించారు. విజయవాడ బెంజిసర్కిల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా... 2 గంటల వరకు మంత్రుల జాడలేకపోవడంతో దాహానికి తాళలేక మజ్జిగ ప్యాకెట్ల కోసం జనం ఎగబడ్డారు. ఆలాగే భోజనం ప్యాకెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది మహిళలు వెనుదిరిగారు. దీంతో మంత్రులు కేవలం 10 నిమిషాల్లోనే సభను ముగించాల్సి వచ్చింది. తాడేపల్లికి చెందిన మెప్మా సభ్యులను నగరపాలక అధికారులు ఉదయం 11.30 గంటలకల్లా పెద్ద సంఖ్యలో ఉండవల్లి కూడలికి తరలించారు. యాత్ర ఆలస్యమవుతుందని తెలియడంతో వారిని ఇంటర్ బోర్డు రాష్ట్ర కార్యాలయ సెల్లారులోకి తరలించారు. మెప్మా మహిళలు, వాలంటీర్లు ఎండకు తాళలేక అల్లాడిపోయారు. 2.30 గంటలకు బస్సు వచ్చింది. వీరంతా అక్కడికి వెళ్లేలోగానే అది వెళ్లిపోవడం గమనార్హం. చివరికి ఉసూరుమంటూ వారంతా అధికారులు, నాయకులను తిట్టుకుంటూ వెనుదిరిగారు.
* పెదకాకాని వై జంక్షన్‌వద్ద జరిగిన బస్సు యాత్రకు గుంటూరు నగరపాలక సంస్థ నుంచి పారిశుద్ధ్య సిబ్బంది, డ్వాక్రా మహిళలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను తరలించారు. అక్కడే సిబ్బందికి హాజరును నిర్ధారించే ఐరిష్‌ను సూపర్‌వైజర్ నమోదు చేయడం గమనార్హం.
* పెదకాకానిలో సభకు వస్తే ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, చేతి కర్రలు ఇస్తామని వైకాపా నాయకులు చెప్పడంతో ఎండను సైతం లెక్క చేయకుండా గుంటూరు నగరం, తాడికొండ నియోజక వర్గాల నుంచి దివ్యాంగులు సభకు వచ్చారు. అందజేసిన వాటిల్లో కొన్ని ట్రైసైకిళ్లు తుప్పు పట్టి ఉన్నాయి. టైర్లలో గాలి లేదు. వాటిని తీసుకున్న వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
* ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం జి.ఉమ్మడివరంలో బస్సు యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన యువతుల నృత్య ప్రదర్శన చర్చనీయాంశమైంది. సమయాభావంతో సభను రద్దు చేశారు.
జగన్ కాలం చెల్లిన రాజకీయ నేత..
నాలిక్కరుచుకున్న మంత్రి కారుమూరి
‘జగన్ కాలం చెల్లిన రాజకీయ నేత’...అని పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించడంతో సభా వేదికపై ఉన్న ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు. శనివారం గన్నవరంలో జరిగిన సభలో ఇది చోటుచేసుకుంది. మంత్రి కారుమూరి ఆవేశంగా ప్రసంగిస్తూ.. జగన్ బీసీలకు అన్నీ చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. తెదేపా అధినేత చంద్రబాబును విమర్శించే క్రమంలో... ఈర్ష్యతో, ద్వేషంతో, కుళ్లుతో, కుతంత్రంతో వ్యవహరిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ‘అవుట్ డేటెడ్’ అయిపోయారని వ్యాఖ్యానించారు. అనంతరం కారుమూరి సర్దుకుని ‘సీఎం జగన్ అందరికీ మంచి చేస్తున్నారు. ఆయనకు అందరూ అండగా ఉండాలి’ అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Related-stories News
Amarnath yatra: సైనికుల సాహసం.. 4 గంటల్లోనే వంతెన నిర్మాణం
-
Politics News
Raghurama: ఆ జాబితాలో నా పేరు లేదు.. పర్యటనకు రాలేను: మోదీకి రఘురామ లేఖ
-
Related-stories News
భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
-
Related-stories News
Tajmahal: తాజ్‌మహల్ గదుల్లో దేవతల విగ్రహాలు లేవు
-
Ts-top-news News
Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- బిగించారు..ముగిస్తారా..?
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Narendra Modi: డబుల్ ఇంజిన్ వస్తోంది