ట‘మాట వింటోంది’..

టమాటా ధరలు చుక్కలను అంటుతున్న తరుణంలో వినియోగదారులకు కాస్త ఊరట కలిగించేలా దిగుబడులు పెరుగుతున్నాయి. టమాటాకు అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన అన్నమయ్య జిల్లా మదనపల్లెకు గురువారం

Published : 24 Jun 2022 02:42 IST

మదనపల్లెకు వెయ్యి టన్నుల సరకు రాక  
మున్ముందు తగ్గనున్న ధరలు
వినియోగదారులకు ఊరట

న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ: టమాటా ధరలు చుక్కలను అంటుతున్న తరుణంలో వినియోగదారులకు కాస్త ఊరట కలిగించేలా దిగుబడులు పెరుగుతున్నాయి. టమాటాకు అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన అన్నమయ్య జిల్లా మదనపల్లెకు గురువారం ప్రస్తుత సీజన్‌లో అత్యధికంగా 1002 టన్నుల సరకు వచ్చింది. ఇక్కడికి 2016 జూన్‌లో 1,500 టన్నుల వరకు వచ్చింది. ఆ తర్వాత అంతస్థాయిలో సరకును రైతులు ఇప్పుడే తీసుకొచ్చారు. మార్కెట్‌కు మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాలతో పాటు కర్ణాటక సరిహద్దు నుంచి టమాటా వస్తోంది. గురువారం ఏ-గ్రేడ్‌ టమాటా కిలో రూ.28 నుంచి రూ.32 వరకు, బీ-గ్రేడ్‌ కిలో రూ.20 నుంచి రూ.27.80 పలికింది. సగటున కిలో రూ.25 నుంచి రూ.31 వరకు రైతు వద్ద కొంటున్న వ్యాపారులు... తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారని మార్కెట్‌ ఇన్‌ఛార్జి కార్యదర్శి అభిలాష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని