డీఎస్సీ-98 అభ్యర్థుల పోస్టింగుకు ఆదేశాలు

డీఎస్సీ-98లో అర్హులైన అభ్యర్థులకు ఒప్పంద ప్రాతిపదికన పోస్టింగ్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మినిమం టైం స్కేల్‌తో ఒప్పంద విధానంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నట్లు

Published : 24 Jun 2022 04:18 IST

ఈనాడు, అమరావతి: డీఎస్సీ-98లో అర్హులైన అభ్యర్థులకు ఒప్పంద ప్రాతిపదికన పోస్టింగ్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మినిమం టైం స్కేల్‌తో ఒప్పంద విధానంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నట్లు పేర్కొంది. డీఎస్సీ-2008 అర్హులైన ఉపాధ్యాయులకు పాటించిన విధానాన్నే డీఎస్సీ-98 వారికీ అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి అనుమతి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఆసక్తి వ్యక్తీకరణను వెబ్‌ సర్వీసు ద్వారా స్వీకరించనున్నారు. క్లస్టర్‌ రిసోర్సు పర్సన్‌ (సీఆర్పీ) ఖాళీలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు, ఆదర్శ పాఠశాలల్లో అతిథి లెక్చరర్లుగా నియమించనున్నారు. ఈ ఖాళీలు పూర్తయ్యాక అభ్యర్థులు ఇంకా మిగిలితే 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల ఏర్పడే ఖాళీలు లేదా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల్లో నియమించేందుకు జిల్లా విద్యాధికారి పూల్‌లో ఉంచుతారు. డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఇస్తున్నట్లే నెలకు రూ.33,670 చొప్పున వేతనం ఇవ్వనున్నారు. ఏడాదికి 10 నెలలే వేతనం ఇస్తారు. ప్రతి ఏడాది ఒప్పందాన్ని పునరుద్ధరిస్తారు. గత ప్రభుత్వంలో నియమించిన కమిటీ 4,567 మంది అభ్యర్థులను అర్హులుగా తేల్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని