సంక్షిప్త వార్తలు

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియను ఈనెల 25లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనానికి పాఠశాలల మ్యాపింగ్‌, హేతుబద్ధీకరణ,

Updated : 24 Jun 2022 05:33 IST

హేతుబద్ధీకరణ పూర్తి చేయండి: కమిషనర్‌

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియను ఈనెల 25లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనానికి పాఠశాలల మ్యాపింగ్‌, హేతుబద్ధీకరణ, బడుల ఉన్నతీకరణను పూర్తిచేసి, ఈనెల 16లోపే నివేదికలు ఇవ్వాల్సి ఉండగా... ప్రత్యేక అధికారులు ఒక్కరూ ఇవ్వలేదన్నారు.


సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వారు  రాంభగీచా వరకు వేేచిఉన్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవ ఉండటంతో గురువారం సాయంత్రం క్యూలైన్‌లో వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకునేందుకు 24గంటల వరకు పట్టనుంది.


మరుగుదొడ్లు లేని దాబాల వద్ద బస్సులు ఆపొద్దు

ఈనాడు, అమరావతి: ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వీలుగా మరుగుదొడ్లు ఉన్నచోట్ల మాత్రమే బస్సులు ఆపాలని.. ఆ సదుపాయాలు లేని దాబాలు, టీ దుకాణాల వద్ద బస్సు ఆపొద్దంటూ ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీచేశారు. ఈనెల 11వ తేదీ రాత్రి సమయంలో ఉదయగిరి డిపోకి చెందిన బస్‌ గుర్రంకొండ దాబా వద్ద టీ విరామం కోసం నిలపగా.. యూరినల్స్‌ కోసం ఓ ప్రయాణికుడు రోడ్డు దాటుతూ మరో బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులకు ఎండీ తాజాగా ఈ ఆదేశాలిచ్చారు.


1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే గర్భిణులకు మధ్యాహ్న భోజనం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో జులై 1వ తేదీ నుంచి గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు మహిళాశిశు సంక్షేమశాఖ సంచాలకురాలు సిరి తెలిపారు. కరోనా వ్యాప్తితో 2020 మార్చి నుంచి కేంద్రాల్లో వండి పెట్టడం నిలిపేసి ఇంటికి సరకుల్ని అందించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని