ప్రైవేటు, ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరి

ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో అర్హత సాధించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. విద్యాహక్కు

Published : 24 Jun 2022 05:17 IST

ఈనాడు, అమరావతి: ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో అర్హత సాధించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఇది తప్పనిసరి అని పేర్కొంది. ఈ ఆదేశాలతో ప్రైవేటు, ఎయిడెడ్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ఎయిడెడ్‌లో ఇప్పటికే చాలామంది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద పనిచేస్తున్నారు. వీరికి ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తోంది. ఇప్పుడు తమను టెట్‌ రాయాలనడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చాలా ప్రైవేటు పాఠశాలల్లో అసలు డీఈడీ, బీఈడీ అర్హత లేనివారే ఎక్కువ. ఇలాంటివారు టెట్‌ రాయడానికి అనర్హులు. టెట్‌ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని