రిజిస్ట్రేషన్‌ శాఖలో ముగ్గురు అధికారులపై వేటు

రిజిస్ట్రేషన్ల శాఖలో గ్రూప్‌-1 స్థాయిలో ఉన్న ముగ్గురు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరళ్ల (డీఐజీ)పై అనూహ్యంగా వేటుపడింది. వారిని ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడటం సంచలనం రేకెత్తిస్తోంది. పైగా

Published : 24 Jun 2022 05:17 IST

ఏసీబీ కేసులున్న ఉద్యోగిని ‘ఎ’ గ్రేడ్‌ కార్యాలయానికి బదిలీ చేయడమే కారణం

ఈనాడు, అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖలో గ్రూప్‌-1 స్థాయిలో ఉన్న ముగ్గురు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరళ్ల (డీఐజీ)పై అనూహ్యంగా వేటుపడింది. వారిని ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడటం సంచలనం రేకెత్తిస్తోంది. పైగా వీరిలో ఇద్దరు ఇటీవలే ఈ పోస్టుల్లోకి రావడం గమనార్హం. విజయవాడలోని పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఏసీబీ కేసులున్న వ్యక్తిని బదిలీ చేయడమే వీరిపై చర్యకు కారణంగా తెలుస్తోంది.  ఏసీబీ కేసులున్నా... అభియోగాలు నమోదుకాని వారికి ఇచ్చినట్లే పటమటలోనూ ఒకరికి పోస్టింగ్‌ ఇచ్చామని అధికారులు వాదిస్తున్నారు. తమ చర్య వివాదాస్పదం కావడంతో అదే అధికారిని ‘ఎ’ గ్రేడ్‌ కార్యాలయమైన తణుకుకు బదిలీ చేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. బదిలీల కౌన్సెలింగ్‌కు జోనల్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన ఏలూరు డీఐజీ అబ్రహంతోపాటు సభ్యులుగా ఉన్న నాగలక్ష్మి(కాకినాడ), రవీంద్రనాథ్‌(కృష్ణా) లను ఈడ్పుగల్లులోని ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. వారి స్థానంలో విశాఖ డీఐజీ బాలకృష్ణకు ఏలూరు, గుంటూరు డీఐజీ జి.శ్రీనివాసరావుకు కృష్ణా, భీమవరం డీఆర్‌ సత్యనారాయణకు కాకినాడ డీఐజీ(ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు అప్పగిస్తూ ఐజీ రామకృష్ణ ఉత్తర్వులు జారీచేశారు. తమిళనాడులో మాదిరిగా ‘ఎ’ శ్రేణి కార్యాలయాల్లో జూనియర్‌ డీఆర్‌లను సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమించాలన్న వ్యవహారమూ చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని