డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌కు సహకరించాలి

డిగ్రీలో కమ్యూనిటీ ప్రాజెక్టు, ఇంటర్న్‌షిష్‌కు కేంద్ర సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్లు సహకరించాలని కళాశాల విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ కోరారు. ఇంటర్న్‌షిప్‌ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 10 సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్ల ప్రతినిధులు,

Published : 24 Jun 2022 05:17 IST

కేంద్ర సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్లకు కమిషనర్‌ సూచన

ఈనాడు, అమరావతి: డిగ్రీలో కమ్యూనిటీ ప్రాజెక్టు, ఇంటర్న్‌షిష్‌కు కేంద్ర సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్లు సహకరించాలని కళాశాల విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ కోరారు. ఇంటర్న్‌షిప్‌ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 10 సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్ల ప్రతినిధులు, మైక్రోసాఫ్ట్‌, కొర్రేరా, సిస్కో, సీఐఐ, ఫిక్కీ సంస్థల సీఈవోలతో గురువారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. నూతన విద్యావిధానానికి అనుగుణంగా డిగ్రీలో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ తీసుకొచ్చామని, డిగ్రీ చివరి ఏడాదిలో ఆరు నెలలు ఉంటుందని వెల్లడించారు. మొదటి సంవత్సరంలో కమ్యూనిటీ ప్రాజెక్టు చేయాలని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో అమలు చేయనున్న 17 నైపుణ్య కోర్సులకు సంబంధించిన ఈ-కంటెంట్‌, వీడియో పాఠాలు, పాఠ్యపుస్తకాలు, ఇంటర్న్‌షిప్‌, పరిశ్రమ అనుసంధానం పోర్టల్‌ను కమిషనర్‌ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జేడీ డేవిడ్‌కుమార్‌ స్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని