పంటల బీమాపై వైకాపా కార్యకర్తల్లో అసంతృప్తి

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో జరిగిన వైకాపా ప్లీనరీలో పంటల బీమాపై కొందరు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయ సమీపంలోని

Published : 24 Jun 2022 05:17 IST

పులివెందుల పార్టీ ప్లీనరీలో బహిర్గతం

పులివెందుల, వేంపల్లె, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో జరిగిన వైకాపా ప్లీనరీలో పంటల బీమాపై కొందరు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయ సమీపంలోని వైయస్‌ఆర్‌ ఆడిటోరియంలో గురువారం కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రభుత్వంలో తమ పాత్ర ఏమీ లేదని, అంతా వాలంటీర్లే నడుపుతున్నారని వివిధ మండలాల్లోని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయని వాపోయారు. రాష్ట్రమంతటా కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలు ఎంపీకి విన్నవించారు. ఈ-క్రాప్‌ నమోదులో లోపాలతో చాలా మంది రైతులకు వైఎస్సార్‌ ఉచిత బీమా అందడం లేదని చెప్పారు. అరటి, ఉల్లి, మామిడి తోటలకు పరిహారం అందకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొందని వివరించారు. వీటన్నింటిపై ఎంపీ కార్యకర్తల్లో భరోసా నింపేలా మాట్లాడారు. సీఎం దృష్టికి తీసుకెళతానని హామీనిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని