తపాలా.. చెత్తకుప్పల పాలు

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట శివార్లలో గురువారం చెత్తకుప్పలో తపాలా కవర్లు వెలుగుచూశాయి. పోస్టులో బట్వాడా కావాల్సిన సుమారు 200కు పైగా ఒరిజినల్‌ ఆధార్‌ కార్డులు, కొన్ని

Published : 24 Jun 2022 05:17 IST

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట శివార్లలో గురువారం చెత్తకుప్పలో తపాలా కవర్లు వెలుగుచూశాయి. పోస్టులో బట్వాడా కావాల్సిన సుమారు 200కు పైగా ఒరిజినల్‌ ఆధార్‌ కార్డులు, కొన్ని లాయర్‌ నోటీసులు, దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు, నిరుద్యోగులు సొమ్ము చెల్లించి ఆర్డర్‌ ఇచ్చిన స్టడీ మెటీరియల్‌.. వంటి అనేక ముఖ్య పత్రాలు తొర్రగుంటపాలెం ఆర్టీఓ కార్యాలయం వెనుక భాగంలోని నిర్జన ప్రదేశంలో కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విజయవాడకు చెందిన తపాలా శాఖ ఇన్‌స్పెక్టర్‌ సూర్యప్రకాశరావు గురువారం సాయంత్రం వీటిని పరిశీలించారు. సమగ్ర విచారణ అనంతరం తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తామని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని