శ్రీసిటీపై దిల్లీ అధికారుల అధ్యయనం

శ్రీసిటీపై దిల్లీ పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు గురువారం అధ్యయనం చేశారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీ(జీఎన్‌సీటీడీ) పరిశ్రమశాఖ కార్యదర్శి, కమిషనర్‌ నిహారిక రాయ్‌, దిల్లీ స్టేట్‌

Updated : 24 Jun 2022 05:35 IST

ఆదర్శ పారిశ్రామికవాడగా కితాబు

శ్రీసిటీ (వరదయ్యపాళెం), న్యూస్‌టుడే: శ్రీసిటీపై దిల్లీ పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు గురువారం అధ్యయనం చేశారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీ(జీఎన్‌సీటీడీ) పరిశ్రమశాఖ కార్యదర్శి, కమిషనర్‌ నిహారిక రాయ్‌, దిల్లీ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ సంజీవ్‌ కుమార్‌ మిత్తల్‌, మరో ఇద్దరు అధికారులు శ్రీసిటీని సందర్శించారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, వాణిజ్య అవకాశాలు, పరిశ్రమల స్థాపన, మార్కెటింగ్‌ పరిస్థితులు, సులభతర వ్యాపారానికి దోహదపడే అంశాల గురించి శ్రీసిటీ ప్రెసిడెంట్‌(ఆపరేషన్స్‌) సతీష్‌ కామత్‌ వారికి వివరించారు. దేశంలోనే పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుకు చక్కని ఉదాహరణగా నిలిచిందని నిహారిక రాయ్‌ ప్రశంసించారు. అనంతరం శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డితో సమావేశమయ్యారు. శ్రీసిటీ ఏర్పాటును ఎండీ దిల్లీ బృందానికి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని