ఎల్లప్పగూడేన్ని పునరావాసంలో చేర్చకపోవడంపై ఆగ్రహం

పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్రక్రియలో భాగంగా ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని దామరచర్లలో గురువారం నిర్వహించిన గ్రామసభ ఉద్రిక్త పరిస్థితుల మధ్య అర్ధాంతరంగా ముగిసింది. గ్రామసర్పంచి గొంది కన్నయ్య,

Published : 24 Jun 2022 05:17 IST

గ్రామసభ రసాభాస

కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్రక్రియలో భాగంగా ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని దామరచర్లలో గురువారం నిర్వహించిన గ్రామసభ ఉద్రిక్త పరిస్థితుల మధ్య అర్ధాంతరంగా ముగిసింది. గ్రామసర్పంచి గొంది కన్నయ్య, ఆర్‌ఐ అనిల్‌కుమార్‌, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైంది. ఈ క్రమంలో మండలంలోని ఎల్లప్పగూడెం గిరిజనులు అభ్యంతరం వ్యక్తంచేశారు. గోదావరి వరదలకు మునిగిపోయే గ్రామాల్లో తమ గ్రామం ముందుంటుందని, అయినప్పటికీ 41.15 కాంటూరులో చేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు తొలగించారు. గోడపత్రికలు, ఫ్లెక్సీలు చించివేశారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. ఈ గ్రామం పేరు 41.15 కాంటూరు పరిధిలో చేర్చాలని అనేక దఫాలు ఉన్నతాధికారులకు విజ్ఞాపనలు అందించారు. అధికారుల విచారణ సైతం జరిగింది. అయినప్పటికీ జాబితాలో చేర్చకపోవడంపై గిరిజనుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని