11 నుంచి మున్సిపల్‌ సమ్మె

మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. జులై 11 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించింది.

Published : 24 Jun 2022 05:17 IST

కార్మికులు, ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయం

గాంధీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే: మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. జులై 11 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించింది. ఇందుకు సిద్ధం కావాలని కార్మికులు, ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చింది. గురువారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఐకాస కన్వీనర్‌ కె.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి మున్సిపల్‌ కార్మికులకు ఇస్తున్న ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్సు నిలిపివేయడం సరికాదన్నారు. ఆరోగ్య భత్యం బకాయిల చెల్లింపుతో పాటు ఇంజినీరింగ్‌ కార్మికులు సహా అందరికీ ఆరోగ్యభత్యం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతంతో పాటు హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించాలని కోరారు. సమావేశంలో ఐకాస నాయకులు పి.సుబ్బారాయుడు, ఇ.మధు, ఎస్‌.శంకర్‌, జి.ప్రసాదు, ఎ.రంగనాయకులు, జి.సుబ్బారావు, పి.వెంకటరెడ్డి, నక్కల సుబ్బారావు, ఎం.డేవిడ్‌, బి.ముత్యాలరావు, మాల్యాద్రి, జి.రామూర్తి, వి.మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని