జడంత గడ్డమే!

జడను తలపిస్తూ 2 అడుగుల గడ్డంతో కనిపిస్తున్న ఈయన పేరు హిమాలయ బాబా. తిరుమల హథీరాంజీ మఠంలో ఉంటున్నారు. స్వస్థలం ప్రకాశం జిల్లా ఉలవపాడు. 13 ఏళ్లుగా తిరుమలలో శ్రీవారి సేవ చేస్తున్నారు. ప్రకృతి

Published : 24 Jun 2022 05:17 IST

ఈనాడు, తిరుపతి: జడను తలపిస్తూ 2 అడుగుల గడ్డంతో కనిపిస్తున్న ఈయన పేరు హిమాలయ బాబా. తిరుమల హథీరాంజీ మఠంలో ఉంటున్నారు. స్వస్థలం ప్రకాశం జిల్లా ఉలవపాడు. 13 ఏళ్లుగా తిరుమలలో శ్రీవారి సేవ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పదార్థాలతో స్వామికి నైవేద్యాలు తయారు చేస్తారు. శ్రీవారి సేవలో చేరే కంటే ముందు హిమాలయాల్లో తపస్సు చేసినట్లు బాబా తెలిపారు. అప్పటి నుంచే గడ్డం పెంచుతున్నట్లు వివరించారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి రూరల్‌ మండలంలోని వకుళామాత అమ్మవారి ఆలయానికి బాబా రాగా.. భక్తులు గడ్డాన్ని ఆసక్తిగా తిలకించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని