పది రోజులపాటు ‘టిడ్కో’ సంబరాలు

రాష్ట్రవ్యాప్తంగా వచ్చే పది రోజులు టిడ్కో సంబరాలు నిర్వహించి 30 వేల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం విజయనగరం జిల్లా సారిపల్లిలో 800 ఇళ్లను మంత్రి

Published : 24 Jun 2022 05:17 IST

మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే పది రోజులు టిడ్కో సంబరాలు నిర్వహించి 30 వేల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం విజయనగరం జిల్లా సారిపల్లిలో 800 ఇళ్లను మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఇళ్లలో వచ్చే ఆగస్టు, సెప్టెంబరు నాటికి 1.32 లక్షల ఇళ్లను, డిసెంబరు నాటికి 2.62 లక్షల ఇళ్లను అందిస్తామన్నారు. ప్రభుత్వం ఈ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగానే వీటిపై రూ. 10 వేల కోట్ల భారాన్ని భరిస్తోందని తెలిపారు. జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీలు రఘురాజు, సురేష్‌బాబు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, టిడ్కో ఛైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విజయనగరం నగరపాలక సంస్థ సమీక్షా సమావేశంలో మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ పురపాలికల్లో విలీన పాఠశాలల ఆస్తులు ఆయా పురపాలక, నగర పాలక సంస్థల పరిధిలోనే ఉంటాయని, ఇందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని