Published : 25 Jun 2022 04:25 IST

న్యాయస్థానం ఆదేశించినా డిస్కంలు డబ్బు చెల్లించలేదు

కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలను విచారించండి
హైకోర్టును కోరిన సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న సౌర, పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) మేరకు డబ్బు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో(డిస్కంలు) స్పందన లేదని విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు శుక్రవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. ఈ వ్యవహారంపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేశామని, అవి విచారణకు వచ్చేలా చూడాలని సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల తరఫు న్యాయవాదులు కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఆ అభ్యర్థనపై స్పందిస్తూ.. వాటిని పరిశీలించి విచారణకు వచ్చేలా చూస్తామని తెలిపింది.

* పీపీఏల్లో నిర్ణయించిన మేరకు సోలార్‌ యూనిట్‌కు రూ.4.84, పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.5.99 చొప్పున సొమ్ము చెల్లించాలని పేర్కొంటూ ఈ ఏడాది మార్చి 15న హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరు వారాల్లో బకాయిలు చెల్లించాలని డిస్కంలను ఆదేశించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంతో యూనిట్‌ టారిఫ్‌ ధరలను తగ్గించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. యూనిట్‌ టారిఫ్‌ ధరలను ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) సమీక్షించేందుకు వీలు కల్పించడంతో పాటు, తాత్కాలిక చర్యల్లో భాగంగా పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 చెల్లించాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని, డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసిన విషయం తెలిసిందే.


జస్టిస్‌ వెంకటాచలానికి హైకోర్టు ఘన నివాళి

ఇటీవల కన్నుమూసిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వై.వెంకటాచలానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, ఇతర న్యాయమూర్తులు శుక్రవారం సమావేశమై ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి మాట్లాడుతూ జస్టిస్‌ వెంకటాచలం అందించిన న్యాయసేవలను కొనియాడారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని