Published : 25 Jun 2022 04:25 IST

డ్రైవర్‌ సుబ్రహ్మణం హత్య కేసును పోలీసులు నీరుగార్చుతున్నారు

చంద్రబాబు ఎదుట తల్లిదండ్రుల ఆవేదన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణలు చంద్రబాబు ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో వారు ఆయనను శుక్రవారం కలిశారు. హత్య కేసు విషయంలో ఇప్పటికీ వైకాపా వర్గాలు, ఇతర వ్యక్తుల నుంచి తమపై ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. హత్య కేసు నుంచి వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును బయటపడేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. తమ కుమారుడి హత్య కేసులో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మద్దతుగా నిలవాలని వారు చంద్రబాబును కోరారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే హత్య కేసులో నిందితులకు శిక్ష పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. తెదేపా తరఫున రూ.5 లక్షలు సాయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పరంగా పూర్తిగా అండగా ఉంటామని వారికి చంద్రబాబు హామీ ఇచ్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని