‘తిత్లీ’ బాధిత రైతులకు నష్టపరిహారం పంపిణీ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో తిత్లీ తుపానుకు నష్టపోయిన రైతులకు రూ.182.60 కోట్ల అదనపు పరిహార పంపిణీ కార్యక్రమాన్ని శాసన సభాపతి తమ్మినేని సీతారాం,

Published : 25 Jun 2022 05:02 IST

రైతుల ఖాతాల్లోకి రూ.182.60 కోట్లు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో తిత్లీ తుపానుకు నష్టపోయిన రైతులకు రూ.182.60 కోట్ల అదనపు పరిహార పంపిణీ కార్యక్రమాన్ని శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం ప్రారంభించారు. గతంలో ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ఈ పరిహారాన్ని అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆపేయాలనేది చంద్రబాబు ఉద్దేశమని, అందుకు అనుగుణంగానే వారు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో తెదేపా హయాంలో తిత్లీ పరిహారం ఇస్టానుసారంగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మరో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం పార్టీల పేరుతో అర్హులకు సైతం ‘తిత్లీ’ పరిహారం దూరం చేసిందని ఆరోపించారు. అనంతరం లబ్ధిదారుల సమక్షంలో నమూనా చెక్కు విడుదల చేశారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ, నరసన్నపేట శాసన సభ్యుడు, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి, కలెక్టర్‌ లఠ్కర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని