Published : 25 Jun 2022 05:02 IST

ఒప్పందాలు అమలు చేయాల్సిందే

స్వదేశీ జాగరణ్‌మంచ్‌ ఆల్‌ఇండియా కన్వీనర్‌ ఆర్‌.సుందరం
అమరావతిలో నిలిచిన కట్టడాల పరిశీలన

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తామంటే కుదరబోదని స్వదేశీ జాగరణ్‌మంచ్‌ ఆల్‌ఇండియా కన్వీనర్‌ ఆర్‌.సుందరం అన్నారు. శుక్రవారం ఆయన అమరావతిలో హైకోర్టు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవన సముదాయాలు, వీఐటీ యూనివర్సిటీ, సచివాలయం తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ఆగిన కట్టడాలను పరిశీలించారు. అనంతరం తుళ్లూరు శిబిరంలో మాట్లాడారు. ‘వనరులు, సౌకర్యాలు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిగా అమరావతిని అప్పట్లో స్వాగతించాం. భూసమీకరణ ద్వారా రాజధాని నిర్మాణానికి 34వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారు. ఇతర ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్‌కు ఎలాంటి అభిప్రాయమున్నా న్యాయస్థానాల తీర్పులను గౌరవించి అమరావతి అభివృద్ధి పనులు కొనసాగించాలని సూటిగా కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణ చట్టం, అమరావతిపై హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులను అధ్యయనం చేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. కాలహరణం చేయకుండా ప్రభుత్వం రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాల విభజనల సమయంలో తమ సంస్థ సమగ్ర అధ్యయనాలు చేసి ఆయా రాష్ట్రాలకు సూచనలిచ్చిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అమరావతి ఐకాస సమన్వయ కమిటీ సభ్యుడు పువ్వాడ సుధాకర్‌ ఆయనకు విన్నపమిచ్చారు. కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు జమ్ముల శ్యామ్‌కిషోర్‌, ధనేకుల రామారావు, గార్నేని స్వరాజ్యరావు, జూజాల చలపతిరావు, పువ్వాడ సురేంద్ర, మాదల వాసు, రాజశేఖర్‌రెడ్డి, ఆకుల ఉమామహేశ్వరరావు, ఐకాస నాయకులు కాటా అప్పారావు, పులి చిన్నా, చిలకా బసవయ్య, కొమ్మినేని సత్యం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

* 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతల నిరసనలు 920వ రోజుకు చేరాయి. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, కృష్ణాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని