Published : 25 Jun 2022 05:02 IST

సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి వారాంతంలో భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి నందకం వరకు వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. తిరుమలలో ఉదయం ఎండవేడిమికి భక్తులు ఇబ్బంది పడ్డారు. రద్దీ అధికంగా ఉండడంతో క్యూలైన్లలో అవస్థ పడుతున్నారు. గురువారం శ్రీవారిని 68,873 మంది దర్శించుకున్నారు. రూ.4.44 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని