జేఈఈ మెయిన్స్‌లో గణితం కొంచెం కష్టం

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలో శుక్రవారం ఉదయం వచ్చిన ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉన్నట్లు శారద, చైతన్య కళాశాలలకు చెందిన నిపుణులు విఘ్నేశ్వరరావు, మురళీరావు తెలిపారు.

Published : 25 Jun 2022 05:02 IST

ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలో శుక్రవారం ఉదయం వచ్చిన ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉన్నట్లు శారద, చైతన్య కళాశాలలకు చెందిన నిపుణులు విఘ్నేశ్వరరావు, మురళీరావు తెలిపారు. గణితం కొంచెం కష్టంగా ఉండగా.. భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి ఇచ్చిన ప్రశ్నలు తేలికగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరూపక జ్యామితి, కలన గణితం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో గణితం, భౌతికశాస్త్రం సబ్జెక్టుల నుంచి వచ్చిన ప్రశ్నలు మధ్యస్తంగా ఉండగా.. రసాయన శాస్త్రం సబ్జెక్టు ప్రశ్నలు తేలికగా ఉన్నాయి. మొత్తం మీద ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉన్నట్లు తెలిపారు. పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేసినవారు, కొంచెం కష్టపడిన వారు ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని