Published : 25 Jun 2022 05:02 IST

జవాబు పత్రాల గల్లంతులో ముగ్గురి సస్పెన్షన్‌

విద్యార్థులకు సరాసరి మార్కులు
‘ఈనాడు’ కథనానికి స్పందన

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: ఇంటర్‌ జవాబు పత్రాలు కనిపించకుండా పోయిన అంశంపై బాధ్యులైన అధికారులపై ఇంటర్‌ విద్యామండలి కమిషనర్‌ చర్యలు తీసుకున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ కళాశాల కేంద్రంగా మే 25న జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షకు సంబంధించి 15 మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండాపోయిన విషయంపై ‘ఆ జవాబు పత్రాలు ఏమయ్యాయి?’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన కమిషనర్‌ ఆ రోజు పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించిన చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌, కస్టోడియన్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఫలితాలు రాని విద్యార్థులకు న్యాయం చేయడానికి ఆయా విద్యార్థి రాసిన సబ్జెక్టుల్లోని సరాసరిని పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణులను చేయడంతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్‌ఐవోగా ఉన్న వెంకటరెడ్డి స్థానంలో డాక్టర్‌ డి.గోపాల్‌రెడ్డి (ఎఫ్‌ఏసీ)ని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని