దూరవిద్య పదోతరగతిలో 52.64% ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) పదోతరగతి, ఇంటర్‌ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించిన దూరవిద్య పది,.....

Published : 25 Jun 2022 05:02 IST

ఇంటర్‌లో 60.40 శాతం
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఫలితాలు వెల్లడి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) పదోతరగతి, ఇంటర్‌ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించిన దూరవిద్య పది, ఇంటర్‌ పరీక్షల ఫలితాలను శుక్రవారం గుంటూరులో ఆ సంస్థ రాష్ట్ర సంచాలకులు కె.శ్రీనివాసులురెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతిలో 32,040 మంది పరీక్షలకు హాజరుకాగా 16,866 మంది (52.64%) ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ పరీక్షలకు 49,238 మంది విద్యార్థులకు 29,742 మంది (60.40%)ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతిలో చిత్తూరు జిల్లా 84.52% ఉత్తీర్ణతతో ముందంజలో నిలవగా అనంతపురం చివరిస్థానంలో ఉంది. ఇంటర్‌లో నెల్లూరు 81.53%తో ప్రథమస్థానంలో నిలవగా అనంతపురం చివరిస్థానంతో సరిపుచ్చుకుంది. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 27 నుంచి జులై 7 వరకు నిర్దేశిత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 11 వరకు జరుగుతాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఆగస్టు 17 నుంచి 20 వరకు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షల ఫీజులు, ఫలితాల వివరాలను www.apopenschool.ap.gov.inలో తెలుసుకోవచ్చన్నారు. రెగ్యులర్‌ పరీక్షల్లాగే తాము కూడా రికార్డుస్థాయిలో తక్కువ వ్యవధిలోనే మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలను వెల్లడించామని శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని