ఏటీసీ టైర్ల ప్లాంటు ప్రారంభానికి సీఎంకు ఆహ్వానం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏపీఐఐసీ సెజ్‌లో ఏర్పాటు చేయనున్న నూతన ప్లాంటు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఏటీసీ టైర్స్‌ సంస్థ ఆహ్వానించింది.

Published : 25 Jun 2022 05:02 IST

ఈనాడు, అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏపీఐఐసీ సెజ్‌లో ఏర్పాటు చేయనున్న నూతన ప్లాంటు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఏటీసీ టైర్స్‌ సంస్థ ఆహ్వానించింది. ఆ సంస్థ డైరెక్టర్‌ తోషియో ఫుజివారా, ఇతర ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎంను కలిశారు. ఆగస్టులో ప్లాంటు ప్రారంభించనున్నట్లు తెలిపి ఆహ్వానించారు. రూ.1,750 కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేయనున్నామని, ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పారు. రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వారు ముఖ్యమంత్రికి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని