Updated : 25 Jun 2022 05:28 IST

పర్యటనకు అనుమతిపై వివరణ ఇవ్వండి

సుజనాచౌదరి పిటిషన్‌పై సీబీఐకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ ఎంపీ సుజనాచౌదరి విదేశీ పర్యటనకు అనుమతించడంపై అభ్యంతరాలేమిటో చెప్పాలంటూ సీబీఐని శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. బ్యాంకులను రూ.6 వేల కోట్ల దాకా మోసం చేసిన వ్యవహారంలో బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ఇందులో సుజనాచౌదరి పాత్ర ఉందంటూ లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసింది. అయితే ఈనెల 30 నుంచి ఆగస్టు 14 వరకు ఎలక్ట్రిక్‌ వాహనాల అవసరాలు, బ్యాటరీలకు సంబంధించి విదేశీ భాగస్వాములతో చర్చించడానికి అమెరికా, ఐరోపాలకు వెళ్లడానికి అనుమతించాలంటూ సుజనాచౌదరి హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ జి.రాధారాణి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నాగముత్తు వాదనలు వినిపిస్తూ సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సుజనాచౌదరి నిందితుడిగా కూడా లేరన్నారు. 2019లో హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చినప్పటికీ లుక్‌అవుట్‌ నోటీసులను పెండింగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధమన్నారు. దీనిపై వివరణ ఇవ్వడానికి గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది గడువు కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని