పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నోటీసు

తమ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు మున్సిపల్‌ కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు.

Updated : 25 Jun 2022 05:24 IST

మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు అందజేత

ఈనాడు, అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు మున్సిపల్‌ కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు. కార్మికులకు ఆరోగ్య భత్యం బకాయిల చెల్లింపుతో పాటు ఇక నుంచి జీతం రూ.15 వేలు, ఆరోగ్య భత్యం రూ.6 వేలు కలిపి ప్రతి నెలా రూ.21 వేలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర అనేక సమస్యలపై గత మూడేళ్లలో అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించని కారణంగా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు.

సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: మంత్రి: పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, సమ్మె చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మున్సిపల్‌ కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులను కోరారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మితో కలిసి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పురపాలక కార్మికులందరికీ రూ.18 వేల వేతనం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బకాయిలు చెల్లించేలా చూస్తామన్నారు. మిగిలిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని