సంక్షిప్త వార్తలు
తెలంగాణలో 493 కేసులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు క్రమేణా పెరుగుతోంది. ఈ నెలలో గత 24 రోజుల పాజిటివిటీని పరిశీలిస్తే.. అదనంగా ఒక శాతానికి పైగా పెరిగింది. అది ఈ నెల 1న 0.61 శాతం ఉండగా.. 24న 1.69 శాతానికి ఎగబాకింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 29,084 నమూనాలను పరీక్షించగా.. ఇందులో 493 కొత్త కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత మూడు నెలల్లో ఇదే అత్యధిక పెరుగుదల.
ఆరుగురు ఎన్సీసీ క్యాడెట్లకు కరోనా
కాకినాడ(మసీˆదు సెంటర్), న్యూస్‌టుడే: కాకినాడ నగరం యాళ్లవారిగరువులోని ఎస్ఆర్కే మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరంలో ఆరుగురు క్యాడెట్లకు కరోనా సోకినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ హనుమంతరావు తెలిపారు. అనుమానిత లక్షణాలున్న 53 మంది విద్యార్థుల నుంచి గురువారం నమూనాలు తీసి కాకినాడ జీజీహెచ్‌కు పంపించామని, శుక్రవారం వచ్చిన ఫలితాల్లో ఆరుగురికి పాజిటివ్‌గా తేలిందన్నారు. వారిని శిబిరంలోనే ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
తిరుపతిలో అప్రెంటీస్‌షిప్ జాబ్ మేళా
ఈనాడు, అమరావతి: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, అప్రెంటీస్ ట్రైనింగ్ బోర్డు చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో జులై 1న శ్రీవేంకటేశ్వర వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో అప్రెంటీస్‌షిప్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు ఈ మేళాలో పాల్గొనేందుకు అర్హులని వెల్లడించారు. 2019 సెప్టెంబరు తర్వాత ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో, మూడుసెట్ల జిరాక్స్‌లతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు www.mhrdnats. gov.inలో నమోదు చేసుకోవాలని కోరారు.
ఎన్ఆర్ఐ తెదేపా సమన్వయకర్తగా బుచ్చి రాంప్రసాద్
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్ఆర్ఐ తెదేపా రాజకీయ విభాగానికి సమన్వయకర్తగా కె.బుచ్చిరాంప్రసాద్ను, సర్వీసుల విభాగంలో సమన్వయకర్తగా సీహెచ్ రాజశేఖర్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌గా పూజారి శైలజ
విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌గా మాజీ క్రీడాకారిణి పూజారి శైలజ నియమితులయ్యారు. ఆమెను విశాఖపట్నం డీఎస్‌ఏలో గ్రేడ్-3 కోచ్‌గా నియమిస్తూ శాప్ వైస్‌ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి నియామక ఉత్తర్వులు జారీచేశారని శాప్ కార్యాలయం వెల్లడించింది. 2002 ఇంగ్లండ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 75 కేజీల కేటగిరీలో శైలజ పసిడి పతకం సాధించింది.
డీఏ బకాయిలు అందక ఉద్యోగుల ఆందోళన
ఈనాడు, అమరావతి: డీఏ బకాయిలందక ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు వెల్లడించారు. 2018 జులై, 2019 జనవరి డీఏలకు సంబంధించి సీపీఎస్ ఉద్యోగులకు నగదు ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో అన్ని ఖాళీలే: ఎమ్మెల్సీ
ఈనాడు, అమరావతి: జిల్లా ఉపాధ్యాయ విద్యా సంస్థ(డైట్)ల్లో 95%పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ ప్రకటించిందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. డైట్‌ల్లో ఖాళీలపై శాసన మండలిలో అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సమాధానమిచ్చిందని వెల్లడించారు.
నారాయణ విద్యాసంస్థల విజయ దుందుభి
హైదరాబాద్, న్యూస్‌టుడే: జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏటా ప్లస్ 1, ప్లస్ 2 విద్యార్థులకు నిర్వహించే కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)పోటీ పరీక్షలో నారాయణ విద్యాసంస్థ విద్యార్థులు 172 మంది ఎంపికై విజయ దుందుభి మోగించారు. ఓపెన్ కేటగిరీలో 1, 2, 8 సహా 20 లోపు 9 ర్యాంకులు, 50 లోపు 15 ర్యాంకులు, 100 లోపు 25 ర్యాంకులు సాధించారు. పీడబ్ల్యూడీ విభాగంలోనూ ఆలిండియా మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ గ్రూప్ డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణలు విద్యార్థులను అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)