ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం నేడే

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం ఆదివారం తేలనుంది. స్థానిక ఆంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్లను లెక్కిస్తారు.

Published : 26 Jun 2022 05:17 IST

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం ఆదివారం తేలనుంది. స్థానిక ఆంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్‌ హాలులో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉదయం 8 గంటలకు రిటర్నింగ్‌ అధికారి హరేంధిర ప్రసాద్‌ టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు తుది ఫలితం తేలుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్‌ చివర్లో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన అయిదు పోలింగ్‌ కేంద్రాల్లోని వీవీ ప్యాట్లను ప్రత్యేకంగా లెక్కిస్తామని రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయరావు శనివారం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని