రికార్డు స్థాయిలో తోతాపురి మామిడి ధర

తిరుపతి జిల్లా పాకాల మ్యాంగోనగర్‌ మార్కెట్‌లో గుజ్జులో వినియోగించే తోతాపురి రకం మామిడి కాయల ధర గతంలో ఎన్నడూ లేనంతగా టన్ను రూ.35 వేలకు చేరింది.

Published : 26 Jun 2022 05:09 IST

టన్ను రూ.35 వేలు

పాకాల, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా పాకాల మ్యాంగోనగర్‌ మార్కెట్‌లో గుజ్జులో వినియోగించే తోతాపురి రకం మామిడి కాయల ధర గతంలో ఎన్నడూ లేనంతగా టన్ను రూ.35 వేలకు చేరింది. సాధారణంగా జులై ప్రథమార్థం వరకుండే ఈ రకం మామిడి ఈ ఏడాది జూన్‌ మాసాంతానికే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తుండటం, పంట దిగుబడులు తక్కువగా ఉండటంతో వ్యాపారులు పోటీ పడి కొంటున్నారు. ఈ నెల 15న రూ.17-18 వేలకు అమ్ముడైన కాయలు.. పది రోజుల వ్యవధిలోనే రెట్టింపు ధర పలకడం రైతులు, వ్యాపారులను ఆశ్చర్యపరుస్తోంది. మంచి ధర వస్తుండటంతో ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీగా చెప్పుకొనే రంగు కాయలను సైతం రైతులు గుజ్జుకే విక్రయిస్తున్నారు. దీంతో తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలనుంచి వచ్చిన వ్యాపారులు కాయలు దొరక్క అవస్థలు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని