తెలుగును సంస్కృతంలోకి అనువదించే సాఫ్ట్‌వేర్‌కు పేటెంట్‌

తెలుగును సంస్కృతంలోకి అనువదించే సాఫ్ట్‌వేర్‌కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్‌ ఇచ్చింది. దీన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రొఫెసర్‌ తియ్యబిండి కామేశ్వరరావు అభివృద్ధి చేశారు.

Published : 26 Jun 2022 05:09 IST

కావలి, న్యూస్‌టుడే: తెలుగును సంస్కృతంలోకి అనువదించే సాఫ్ట్‌వేర్‌కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్‌ ఇచ్చింది. దీన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రొఫెసర్‌ తియ్యబిండి కామేశ్వరరావు అభివృద్ధి చేశారు. ఆయన గుంటూరులోని వీవీఐటీ కంప్యూటర్‌ విభాగంలో పనిచేస్తున్నారు. తాను రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై కేంద్రానికి 2016లో దరఖాస్తు చేయగా ఇటీవల పేటెంట్‌ అనుమతి వచ్చింది. ఇదే సాంకేతికతను ఆధారంగా చేసుకుని సంస్కృతాన్ని మరిన్ని భాషల్లోకి అనువదించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. రెండో పరిశోధనగా సంస్కృతాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసే సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నామని, దీని పేటెంట్‌ కోసం దరఖాస్తు చేస్తామని అన్నారు. కామేశ్వరరావు భార్య రాజ్యలక్ష్మి కూడా ఇదే సంస్థలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని