జోడెడ్ల శ్వాసే.. జోల పాట!

కాడెద్దుల ఊయల చిన్నారిని నిదురపుచ్చగా.. అమ్మానాన్నలు దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన రైతు రామాంజనేయులు తన భార్యతో కలిసి శనివారం దుక్కిదున్నే పని చేపట్టారు.

Published : 26 Jun 2022 05:09 IST

కాడెద్దుల ఊయల చిన్నారిని నిదురపుచ్చగా.. అమ్మానాన్నలు దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన రైతు రామాంజనేయులు తన భార్యతో కలిసి శనివారం దుక్కిదున్నే పని చేపట్టారు. తమ రెండేళ్ల కుమార్తెనూ పొలం వద్దకే తీసుకొచ్చారు. ఆమెను పట్టుకునేందుకు అక్కడ ఎవరూ లేకపోవడంతో.. కాడెద్దులకు చీరతో ఊయల కట్టి అందులో నిద్రపుచ్చారు. అలవాటైన జోడెడ్లు కావడంతో చిన్నారికి ఏమీ కాదని రైతు భరోసా వ్యక్తం చేశారు. బుజ్జాయిని ఓ కంట కనిపెడుతూ పనులు చేసుకుంటున్నారు.

- ఈనాడు, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని